సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయండి
కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి జెల్లా ప్రభాకర్ పిలుపు
బెజ్జంకి, నవంబర్ 18 (ప్రజావాణి)
రేపు సిద్దిపేటలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల అధికార ప్రతినిధి జెల్లా ప్రభాకర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని,ముఖ్యంగా నూతనంగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయని,రైతు సంక్షేమం, మహిళా సాధికారత, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నూతన పింఛన్ల మంజూరు వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభపై ప్రజల్లో ఆసక్తి నెలకొందనితెలిపారు.కావున బెజ్జంకి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నూతన పింఛన్ లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున సిద్దిపేటకు తరలివచ్చి ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని జెల్లా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

