నీరు, విద్యుత్తు వినియోగం అవసరం మేరకు ఉండేలా చూడాలి
*నీరు, విద్యుత్తు వినియోగం అవసరం మేరకు ఉండేలా చూడాలి* *ఎల్నీనో తుఫాను ను అందరి సహకారంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలి* *మండల సర్వ సభ్య సమావేశంలో మండల ప్రత్యేక అధికారి పూర్ణిమ* జహీరాబాద్, నవంబర్ 17 (ప్రజావాణి): తాగునీరు, కరెంట్ వృధా కాకుండా పొదుపుగా వాడుకోవాలని జహీరాబాద్ మండల ప్రత్యేక అధికారి పూర్ణిమ, ఎంపీడీవో వెంకట్ రెడ్డి సర్పంచులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ఎంపీపీ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో వారు మాట్లాడారు. ఎల్నీనో ప్రభావం వల్ల సక్రమంగా వర్షాలు కురువనందున...