📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసిపిఎస్ ఉద్యోగుల సామూహిక సెలవు ధర్మదీక్ష విజయవంతం.

సిపిఎస్ ఉద్యోగుల సామూహిక సెలవు ధర్మదీక్ష విజయవంతం.

📰 Generate e-Paper Clip

సిపిఎస్ ఉద్యోగుల సామూహిక సెలవు ధర్మదీక్ష విజయవంతం.

పాల్వంచ, నవంబర్17,ప్రజావాణి

సిపిఎస్ ను రద్దు చేస్తామన్న ప్రభుత్వ హామీ నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ మేనిఫెస్టోను గౌరవించి సిపిఎస్ వెంటనే రద్దు చేయాలి. కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల ముందు మాట ఇచ్చి మ్యానిఫెస్టో పెట్టిన విధంగా వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాతపెన్షన్ అమలు చేయాలని టి ఎస్ సి పి ఎస్ ఇ యు భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు శ్రీ తుక్కాని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్ సీపీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగు ఉపాధ్యాయులు నేడు సామూహిక సెలవులు పెట్టి 33 జిల్లా కేంద్రాల్లో ధర్నా చౌక్లో ధర్మదీక్షలు చేసే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి జిల్లాలోని సుమారు 2000 సిపిఎస్ ఉద్యోగు ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టి కలెక్టరేట్ ప్రాంగణంలోని ధర్నా చౌక్ లో ధర్మదీక్ష చేశారు.ఈ ధర్మదీక్ష కార్యక్రమం లో భద్రాద్రి జిల్లాలోని అన్ని ఉద్యో గ ఉపాధ్యాయ సంఘాలు నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ ధర్మదీక్ష కార్యక్రమం టి ఎస్ సి పి ఎస్ ఇ యు జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2023 సాధారణ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేస్తే వెంటనే సిపిఎస్ మీరు రద్దుచేసి పాత పెన్షన్ ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు అయినా ప్రభుత్వం నుండి సిపిఎస్ రద్దు దిశగా ఎలాంటి అడుగులు పడకపోవడం చే జూలై 11 నుంచి టి ఎస్ సి పి ఎస్ ఇ యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ స్థిత ప్రజ్ఞ భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం రాములవారి పాదాల నుండి సిపిఎస్ రద్దు కోరుతూ జన జాగరణ పేరుతో 33 జిల్లాల మీదుగా బస్సు యాత్ర చేయడం జరిగింది. ఈ జన జాగరణ యాత్రలో తెలంగాణ లోని సుమారు వందమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిసి సిపిఎస్ ను రద్దు కోరుతూ వినతి పత్రాలు అందించడం జరిగింది. జన జాగరణ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 23న వేలాదిమంది సిపిఎస్ ఉద్యోగు ఉపాధ్యాయులతో లాల్ బహుదూర్ స్టేడియంలో జన జాగరణ సభను చేయడం జరిగింది. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ నవంబర్ 17 లోపు సిపిఎస్ రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోపోతే నవంబర్ 17న రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగు ఉపాధ్యాయులు అందరూ సామూహిక సెలవు పెట్టి ధర్మదీక్షలు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం చే ఈరోజు భద్రాద్రి జిల్లాలోని సామూహిక సెలవాలు పెట్టి ధర్మదీక్ష చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం వారి మేనిఫెస్టోని గౌరవించి వెంటనే సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లేకపోతే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని సిపిఎస్ ని రద్దు చేసే వరకు ఉద్యమా న్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు.

తీర్మానాలు

ఈ ధర్మదీక్ష సభ సాక్షిగా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు సిపిఎస్ ఉద్యోగుల ఉపాధ్యాయుల చప్పట్ల మధ్య ఈ క్రింది తీర్మానాలు చేయడం జరిగింది.

1) మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే సిపిఎస్సి రద్దు చేయాలి సిపిఎస్ రద్దు కమిటీలో టీఎస్ సి పీ యస్ కు ప్రాతినిధ్యం కల్పించాలి.

2)న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీములో రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగులకు కూడా ట్రీట్మెంట్ కొనసాగించాలి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ట్రస్ట్ బోర్డ్ లో సిపిఎస్ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలి.

3)సిపిఎస్ ఉద్యోగుల డి ఏ బకాయిలు ఏక మొత్తంలో నగదు రూపంలో చెల్లించాలి.

రాబోయే డీఎ, పిఆర్సి ఏరియాస్ ని కూడా ఏక మొత్తంలో నగదు రూపంలో చెల్లించాలి.

ఈ ధర్మదీక్ష కార్యక్రమంలో టిఎస్ సీపీఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రాష్ట్ర ఐ టి సెల్ కార్యదర్శి గోరింట్ల సురేష్,రాష్ట్ర కార్యదర్శి నాగు నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ,మహిళా ఉపాధ్యక్షురాలు మంజు శ్రీ తో పాటు జిల్లా బాధితులు 23 మండలాల బాధ్యులు పాల్గొన్నారు. టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ టీజీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ పిఆర్టియు టీజీ జిల్లా అధ్యక్షుడు రవి, టిజిఎల్ఏ జిల్లా అధ్యక్షుడు టీజీవో ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ సెక్రటరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కిరణ్, సతీష్ లు, పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షుడు నరసయ్య, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, తెలంగాణ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ కళావిజ్ఞాన వేదిక అధ్యక్షుడు వెంకట ముత్యం, ఐసిడిఎస్ జిల్లా అధ్యక్షులు ధనలక్ష్మి, ఏఎన్ఎముల అధ్యక్షురాలు ఉమారాణి,భద్రాచలం రాముల గుడి అర్చకులు రవికుమార్ శర్మ,టిపియుఎస్ జిల్లా అధ్యక్షుడు సురేష్, ఆర్ యు పీ పీ జిల్లా అధ్యక్షుడు రామ్ సింగ్ లు, ఏ టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాంబాబు,టిఎన్జీవో జిల్లా నాయకుడు శ్రీనివాసరావుతో పాటు టీఎస్ సి పీ యస్ భద్రాద్రి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.