📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅందోల్ మండలంలో 602 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు

అందోల్ మండలంలో 602 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు

📰 Generate e-Paper Clip

*అందోల్ మండలంలో 602 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు*

• లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

• 25 గ్రామపంచాయతీల పరిధిలో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూత

అందోల్ | నవంబర్ 17 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

అందోల్ మండలంలోని 25 గ్రామపంచాయతీల పరిధిలో కొత్తగా 602 మందికి ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సంగుపేటలోని లక్ష్మీదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.

వర్గాల వారీగా మంజూరైన పింఛన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

• వితంతు మహిళలు – 436
• వికలాంగులు – 86
• ఒంటరి మహిళలు – 46
• కల్లుగీత కార్మికులు – 33
• చేనేత కార్మికులు – 1

మొత్తం – 602 మంది లబ్ధిదారులు.

ఎన్నో రోజులుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

602 కుటుంబాలకు కొత్త ఆశలు.. చేయూత పింఛన్లతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమైంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.