📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణRajanna Sircillaప్రగతి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ప్రగతి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ప్రగతి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల, నవంబర్ 16: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గల ప్రగతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు కార్యక్రమాలను నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా ఏడవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఉపాధ్యాయుల పాత్రను పోషిస్తూ బోధన చేయడంతో పాటు, ఆ బాధ్యతల్లో తమకు ఎదురైన అనుభవాలను తోటి విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు జవహర్‌లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న జన్మించారని, ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, అందుకే చిన్నారులు ఆయనను ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచేవారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.

విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా నేర్చుకోవాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీకి కట్టుబడి ఉండాలని, స్వేచ్ఛతో పాటు బాధ్యతాయుతంగా మెలగాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తమ చుట్టూ ఉన్న పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం. శ్రీనివాస్ యాదవ్, ఒకరోజు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ఎన్. సాత్విక, డీఈఓగా వ్యవహరించిన పిరితేష్, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.