📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణRajanna Sircillaరిబ్బన్ కటింగ్లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!

రిబ్బన్ కటింగ్లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!

📰 Generate e-Paper Clip

రిబ్బన్ కటింగ్లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!

రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం

ప్రారంభించి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు శూన్యం.. దళారుల చేతిలో రైతులకు నష్టం!

తంగళ్ళపల్లి ప్రజావాణి నవంబర్ 15 దాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం, కొనుగోళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని తంగళ్ళపల్లి మండల సర్పంచు ల ఫోరం అధ్యక్షుడు పుర్మాని రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రిబ్బన్ కటింగులు, కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితం చేశారని, క్షేత్రస్థాయిలో మాత్రం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావడం లేదని విమర్శించారు. కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో తూకం ప్రారంభం కాకపోవడంతో దళారులు రోజురోజుకు ధాన్యం ధరలను తగ్గిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,200 ధర పలకగా, ప్రస్తుతం దళారులు రూ.2,300కే అడుగుతున్నారని పేర్కొన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ప్రారంభించిన ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తక్షణమే తూకం ప్రారంభించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి, దళారుల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పూర్మనీ రాజశేఖర్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.