చెన్నారిగూడెంలో నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
*చెన్నారిగూడెంలో నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ* *లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు* చిలుకూరు, నవంబర్ 14 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా చెన్నారిగూడెం గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన పేదలు, వృద్ధులు, ఇతర లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని...