📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణక్యాన్సర్ నిర్ధారణలో సరికొత్త పరిశోధన

క్యాన్సర్ నిర్ధారణలో సరికొత్త పరిశోధన

📰 Generate e-Paper Clip

క్యాన్సర్ నిర్ధారణలో సరికొత్త పరిశోధన

గీతం యూనివర్సిటీ విద్యార్థికి డాక్టరేట్

డీప్ లెర్నింగ్ మోడళ్లతో ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రేడింగ్‌లో 98.8 శాతం కచ్చితత్వం సాధించారు

పటాన్చెరువు, నవంబర్ 14 (ప్రజావాణి): గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి హెచ్.వి. రమణారావు పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను కచ్చితంగా గుర్తించి, గ్రేడింగ్ చేసే విధానాన్ని మెరుగుపరిచే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది.‘డీప్ లెర్నింగ్ మోడళ్ల మూల్యాంకనం, ఏకీకరణ ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రేడింగ్‌ను మెరుగుపరచడం’ అనే అంశంపై ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. గీతం కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రవిశంకర్ మార్గదర్శకత్వంలో ఈ పరిశోధన సాగింది.హిస్టోపాథలాజికల్ చిత్రాల ఆధారంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను స్వయంచాలకంగా గుర్తించడం, గ్రేడింగ్ చేయడంలో అధునాతన డీప్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేశారు. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్‌లు, విజన్ ట్రాన్స్‌ఫార్మర్లను సమన్వయం చేయడం ద్వారా 98.8 శాతం వర్గీకరణ కచ్చితత్వాన్ని సాధించారు. ఈ పరిశోధన భవిష్యత్తులో క్యాన్సర్ నిర్ధారణను మరింత కచ్చితంగా, వేగంగా చేపట్టేందుకు దోహదపడనుంది.రమణారావు పీహెచ్‌డీ సాధించడంపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి సయ్యద్ అక్బరుద్దీన్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. మహబూబ్ బాషా, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఆయన పరిశోధన రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.