📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకాంట్రాక్టర్ల ధన దాహానికి మూడు నాళ్ల ముచ్చటగా సిసిరోడ్లు

కాంట్రాక్టర్ల ధన దాహానికి మూడు నాళ్ల ముచ్చటగా సిసిరోడ్లు

📰 Generate e-Paper Clip

కాంట్రాక్టర్ల ధన దాహానికి మూడు నాళ్ల ముచ్చటగా సిసిరోడ్లు

* సీసీ రోడ్డు పగుల్లె పగుళ్ళు

* నాణ్యతను పట్టించుకోకుండా ఆగమాగం పనులు

* నెలైనా గడవకముందే అక్కరకు రాకుండా పోతున్న వైనం

* మహాత్మా గాంధీ యువజన జనరల్ ఫండ్ నిధులు వృథా
పట్టించుకోని అధికారులు

జమ్మికుంట నవంబర్ 14 (ప్రజావాణి)

జమ్మికుంటలోకాంట్రాక్టర్ల ధన దాహానికి గ్రామాల్లో వేస్తున్న సీసీ రోడ్లు మూడు నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. నాణ్యతను పట్టించుకోకుండా ఆగమాగంగా పనులు చేయడంతో నెలైనా గడవకముందే రోడ్లు అక్కరకు రాకుండా పోతున్నాయి. కోట్లాది రూపాయల మహాత్మా గాంధీ యువజన జనరల్ ఫండ్ నిధులు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయిఇది జమ్మికుంట మండలం నగురం గ్రామంలో రూ. 10 లక్షలతో వేసిన సీసీ రోడ్డు. పదికాలాల పాటు నాణ్యతగా ఉండాల్సింది పోయినెలైనా గడవకముందే పగుళ్లు తేలింది రోడ్డుపై పొర ఊడిపోయి సిమెంట్ పొడిలా రాలిపోతున్నది. కాంట్రాక్టర్ల ధన దాహానికి లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయనడానికి ఇదే చక్కని ఉదాహరణ
ఈ రోడ్డు ఇప్పుడే ఇలా పగుళ్లు బారితే, రాబోయే రోజుల్లో ప్రజలు ఎంతటి దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా ఏలినోవా ప్రభావంతో కొట్టె ఎండలకు పగుళ్లు మరింత ఏర్పడతాయిరోడ్డు మరింత బీటలు వారి గుంతలు పడి పూర్తిగా అక్కరకు రాకుండా పోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుఈ ఒక్క రోడ్డే కాదుజిల్లాలో అనేకచోట్ల ఇదే దుస్థితి కనిపిస్తున్నది. పనులు ప్రారంభించినప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంనాణ్యత లేని మెటీరియల్ వాడుతున్నా అడిగేవారు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
నాణ్యత లోపంతో వేసిన ఈ రోడ్డుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మళ్లీ నాణ్యతతో రోడ్డు వేయించాలని తలోడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.