📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం

ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం

📰 Generate e-Paper Clip

*ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, పక్కా కార్యాచరణ ప్రణాళికతో రాబోయే 10 రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని, కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి జరిగిన నేపథ్యంలో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, రైతులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.