ఎండపల్లి మండలం గుల్లకోటలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ ఆశయాలు, “నేటి బాలలే రేపటి పౌరులు” నినాదాన్ని విద్యార్థులకు వివరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కుమార్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గుల్లకోటలో ఘనంగా బాలల దినోత్సవం.. సర్పంచ్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు
0
6


