📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణTUWJ-IJU మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా బచ్చల సుభాష్ ఏకగ్రీవ ఎన్నిక

TUWJ-IJU మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా బచ్చల సుభాష్ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

TUWJ-IJU మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా బచ్చల సుభాష్ ఏకగ్రీవ ఎన్నిక
దండేపల్లి, నవంబర్ 13 (ప్రజావాణి):
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బచ్చల సుభాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా జర్నలిస్టులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా బచ్చల సుభాష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మంచిర్యాల జిల్లా జర్నలిస్టులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
లింగాపూర్ గ్రామానికి చెందిన బచ్చల సుభాష్ జిల్లా స్థాయి జర్నలిస్టు సంఘంలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.