📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమంచాల కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు

మంచాల కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు

📰 Generate e-Paper Clip

*మంచాల కేంద్రంలో ప్రయాణికుల అవస్థలు*

*బస్సు షెల్టర్లు, మహిళలకు మరుగుదొడ్లు కరువు!*

*ఖాళీ స్థలాలు నిరుపయోగం.. ఆక్రమణలకు అవకాశం.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు*

మంచాల, నవంబర్ 13 (ప్రజావాణి):

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండేందుకు బస్సు షెల్టర్లు, అత్యవసర అవసరాల కోసం మరుగుదొడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు.

మంచాల కేంద్రంలోని జాపాల్ రోడ్డు నుంచి ఆరుట్ల వెళ్లే మార్గంలో సుమారు తొమ్మిది బస్సు అభ్యర్థన నిలుపుదల కేంద్రాలు ఉన్నప్పటికీ, ఎక్కడా ప్రయాణికులు కూర్చోవడానికి, ఎండకు, వానకు రక్షణ పొందడానికి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయలేదు. గ్రామపంచాయతీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, గ్రంథాలయం, మండల కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో మహిళలు, వృద్ధులు అధికంగా ఉంటారు. పనులు ముగించుకొని తిరిగి వెళ్లేందుకు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎండ వచ్చినా, వర్షం కురిసినా దుకాణాల ముందు, ఇళ్ల అరుగుల వద్ద నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పేరుకే మండల కేంద్రంగా ఉన్న మంచాల గ్రామంలో ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాత గ్రంథాలయం గోడలు తొలగించి బస్సు షెల్టర్ నిర్మించాలి

గ్రామ సెంటర్లో పాత గ్రంథాలయాన్ని కూల్చివేసిన తర్వాత మిగిలిన గోడలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఆ గోడలను పూర్తిగా తొలగించి, అందుబాటులో ఉన్న స్థలంలో ఆధునిక బస్సు షెల్టర్ నిర్మిస్తే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏర్పుల నర్సింహ, ఈ సమస్య పైన అధికారులు వెంబడే స్పందించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.