📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్పివి పాఠశాలలో ఘనంగా మాతృ వందనం

పివి పాఠశాలలో ఘనంగా మాతృ వందనం

📰 Generate e-Paper Clip

మేడ్చల్ కృష్ణానగర్ కాలనీలోని పివి హైస్కూల్‌లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో మాతృ వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దీపారాధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య అతిథి IMCTF కన్వీనర్ శ్రీ ఆర్. రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవిస్తూ, మంచి నడవడిక, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాల డైరెక్టర్ రామేశ్వర్ రెడ్డి కూడా విలువల ప్రాధాన్యతను వివరించారు. “విలువల నిర్మాణమే దేశ నిర్మాణం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు భావోద్వేగానికి లోనై, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.