📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవేములపల్లి మండల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

వేములపల్లి మండల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

వేములపల్లి మండల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 12

మిర్యాలగూడ
వేములపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి కార్యక్రమాలు, సామర్థ్యవృద్ధి కార్యక్రమాల అమలుపై నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – BLR* పాల్గొన్నారు…
ఈ సందర్భంగా మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సామర్థ్యవృద్ధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, గ్రామాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే BLR సూచించారు. అభివృద్ధి పనుల అమలులో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని తెలిపారు…
ఈ సమావేశంలో మండల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.