“బాలాజీ”కి సర్పంచిలు కాంగ్రెస్ నేతల పరామర్శ..
ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని రత్తిరామ్ తండా చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్ కు ఇటీవల పితృవియోగం జరిగింది.మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరువేరుగా స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి
పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాలాజీ నాయక్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆపద సమయంలోను ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
పరామర్శించిన సర్పంచులు
మాదరి ప్రశాంత్,బొల్లికొండ చైతన్య,తూర్పటి శంకరయ్య,గుగులోత్ కరుణ మధు,భూక్యా వీరన్న,యాసం సంధ్య రమేష్.గుగులోత్ అశోక్,
కత్తుల కళ్యాణి యాకంతం, గోగుల మమతా ప్రశాంత్,గొడుగు జ్యోతి రామకృష్ణ,గుండె బోయిన ఉష అశోక్,గుగులోత్ హేమలత శ్రీనివాస్ ఉన్నారు.
పరామర్శించిన డిసిసి మాజీ అధ్యక్షుడు నాయకులు
డిసిసి మాజీ అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి,జిల్లా మండల నాయకులు ప్రకాశ్ రెడ్డి,రాంరెడ్డి, సత్యపాల్ రెడ్డి,సాయి,సునీల్ నాయక్,రాజేష్, ఝాన్సీ నరేష్ నాయక్,స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


