📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం

బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం

📰 Generate e-Paper Clip

*బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం*

• సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా పోతురాజుకు యాదవుల ప్రత్యేక పూజలు

• ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి

మన ప్రజావాణి | బస్వాపూర్ | నవంబర్ 12 | జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి సదర్ సమ్మేళనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి యాదవులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సదర్ సమ్మేళనంలో భాగంగా యాదవులు పోతురాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్, జోగిపేట యాదవ సంఘం నాయకుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.