సంగారెడ్డిలో పి ఆర్ టి యు ఎస్ నూతన జిల్లా సంఘ భవన నిర్మాణ పనులకు శ్రీకారం
• మొదటి కాంక్రీట్ స్లాబ్ పనులకు పూజా కార్యక్రమాలు..
మన ప్రజావాణి నవంబర్ 11 | సంగారెడ్డి | జిల్లా ప్రతినిధి
పి ఆర్ టి యు టి ఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో నిర్మాణమవుతున్న నూతన జిల్లా సంఘ భవన నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి కాంక్రీట్ స్లాబ్ పనుల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎ. మాణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. విఠల్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు తులసీరామ్ రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంఘ భవన నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తికావాలని, సంఘ భవనం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కార్యకలాపాలకు కేంద్రంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. ప్రభు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు డి. శ్రీనివాస్, ఎన్. మల్లయ్య, విఠల్, శాతం రాములు, ఎం. మోహన్, అరవింద్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.హెచ్. చంద్రశేఖర్, ఎం.డి. మజీద్, పటాన్చెరు మండల శాఖ అధ్యక్షులు ఎస్. రామానుజం, కొండాపూర్ మండల శాఖ అధ్యక్షులు పి. దామోదర్, ప్రధాన కార్యదర్శి ఎస్. లక్ష్మణ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సంఘ బాధ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘ భవన నిర్మాణంలో భాగస్వాములైన నాయకులు, సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ నిర్మాణ పనులు త్వరగా పూర్తికావాలని ఆకాంక్షించారు.


