📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థులు ఎంపిక

📰 Generate e-Paper Clip

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థులు ఎంపిక
రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ వాలీబాల్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థులు ఎంపిక
బాలికల విభాగంలో ముగ్గురు.. బాలుర విభాగంలో ఒకరు
దండేపల్లి, నవంబర్ 11 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌-14 వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 5వ తేదీన రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్‌-14 బాలబాలికల వాలీబాల్ పోటీలు, ఎంపికల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
బాలికల విభాగంలో ఈ. అక్షిత, జి. ప్రసన్య, ఎ. వైష్ణవి, బాలుర విభాగంలో కె. హర్షిత్ మంచిర్యాల జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌-14 బాలబాలికల వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు గాజుల శ్రీనివాస్ తెలిపారు.
విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇన్‌చార్జి మండల విద్యాధికారి మంత్రి రాజు, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు రూపాచారి, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎం.డి. యాకూబ్, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బండి రవి, సూర సుదర్శన్, సీనియర్ పీడీలు రామ్మోహన్‌రావు, సిరంగి గోపాల్, రెబ్బనపల్లి గ్రామ సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉపసర్పంచ్ వినోద్, గ్రామ పెద్దలు విద్యార్థులను అభినందించి రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకర్షించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.