📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపాలకుర్తి నియోజకవర్గం నా ప్రాణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు

పాలకుర్తి నియోజకవర్గం నా ప్రాణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు

📰 Generate e-Paper Clip

పాలకుర్తి నియోజకవర్గం నా ప్రాణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు

పాలకుర్తి నడిబొడ్డున సొంతింటి నిర్మాణం

ప్రజల మధ్యే ఉండాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా ప్రతినిధి జె.
ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గంపై తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి చాటుకున్న మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలో నిర్మిస్తున్న తన సొంత ఇంటి నిర్మాణ పనులను సందర్శించారు.

ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్, డిజైన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకుర్తి తనకు కేవలం రాజకీయ వేదిక మాత్రమే కాదని, తన ప్రాణమని, తన జీవితంలో విడదీయలేని భాగమని పేర్కొన్నారు. పాలకుర్తి ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమానురాగాలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, వారి రుణం తీర్చుకోవడానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తేల్చి చెప్పారు. పాలకుర్తిలో సొంత ఇల్లు నిర్మించుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా అదేనని, ప్రజలకు మరింత చేరువగా, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నదే తన సంకల్పమని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను గతం ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల అండదండలతో పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ నిర్ణయం పట్ల పాలకుర్తి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రజల మధ్యే ఉండాలని నిర్ణయించుకోవడం నియోజకవర్గానికి ఎంతో శుభపరిణామమని, ఆయన నాయకత్వంలో పాలకుర్తి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆయన వెంట జిల్లా నాయకులు, మండల నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.