నర్సాయపల్లి భూముల రీసర్వేకు గ్రామ ప్రజలు సహకరించాలి
హుస్నాబాద్ అర్ డి ఓ రామ్మూర్తి
మద్దూరు నవంబర్11, ప్రజా వాణి,
మండలంలోని నర్సాయపల్లి గ్రామ పంచాయతీలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు,సర్పంచ్ శనిగరం.సత్యనారాయణ ఆధ్వర్యంలో….భూ భారతి చట్టం అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమి రీ సర్వే కార్యక్రమంపై బుదవారం గ్రామ సభ నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హుస్నాబాద్ అర్ డి ఓ రామ్మూర్తి పాల్గొని మాట్లాడుతూ భూముల సర్వేకు సంబంధించి మొదటిసారిగా నిజాం ప్రభుత్వంలో సర్వే చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మరోసారి భూమి రీ సర్వే చేసి ప్రతి రైతుకు భూ ఆధార్ మరియు సర్వే మ్యాప్ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ రహీం, అర్ ఐ కృష్ణ,సర్వేయర్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్,గ్రామ పరిపాలన అధికారి రవి మరియు గ్రామ రైతులు,ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.


