📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కామారెడ్డిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్పంచ్ చింత రవి

కామారెడ్డిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్పంచ్ చింత రవి

📰 Generate e-Paper Clip

కామారెడ్డిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్పంచ్ చింత రవి

కూలీలకు రోజుకు రూ. 305/- వేతనం అందేలా కొలతల ప్రకారం పనులు చేయాలని సూచన

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కామారెడ్డిగూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను గ్రామ సర్పంచ్ చింత రవి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామంలోని తొట్టె కుంటలో జరుగుతున్న ఫిష్ ఫండ్ పనుల వద్దకు చేరుకున్న సర్పంచ్, జరుగుతున్న పనుల తీరును, పురోగతిని పరిశీలించారు. కూలీలు చేస్తున్న పనులను దగ్గరగా చూసి, వారితో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చింత రవి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం పేద, నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పించే గొప్ప పథకమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కూలీలకు సూచించారు. ప్రతి కూలీకి రోజువారీ వేతనం రూ. 305/- వచ్చే విధంగా నిర్ణీత కొలతల ప్రకారం నాణ్యతతో పనులు చేయాలని తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని కోరారు.

ప్రస్తుతం వాతావరణంలో మార్పుల వల్ల ఏర్పడిన ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించడం కోసం కుంటలు, చెరువుల్లో పూడిక తీత, నీటి నిల్వ సామర్థ్యం పెంచే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా, వ్యవసాయానికి, మత్స్య సంపద అభివృద్ధికి ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కుంట అభివృద్ధి చెందితే గ్రామంలో భూగర్భ జలాలు పెరిగి, రైతులకు మేలు జరుగుతుందని, అదే విధంగా మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. అందుకే కూలీలందరూ సమిష్టిగా, క్రమశిక్షణతో పనులు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

కూలీల సంక్షేమం కోసం గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని, వారికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ రిజ్వాన్ సిరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ మొలుగురి నర్సయ్య, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.