ఇరిగేషన్ డీఏవో నాగేందర్ రెడ్డి పెద్దకర్మలో నివాళులర్పించిన నాయకులు
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 11
దామరచర్ల,
దామరచర్ల మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇరిగేషన్ శాఖ డీఏవో (DAO) దివంగత వీరంరెడ్డి నాగేందర్ రెడ్డి పెద్దకర్మ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాగేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. ఇరిగేషన్ శాఖలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో దామరచర్ల మాజీ సర్పంచ్ బంటు కిరణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పగిడి జీడయ్య యాదవ్, నాయకులు బుషిపల్లి శ్రీనివాస్ రెడ్డి, అనిపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

