📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం

అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం

📰 Generate e-Paper Clip

అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం
ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష
పనులను వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలి
దండేపల్లి, నవంబర్ 11 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీఓ కె.వి. ప్రసాద్, ఏపీఓ దుర్గాదాస్, ఈసీ భీమన్న హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు. ముఖ్యంగా వీబీజీఆర్ఏఎం-జీ పథకం కింద చేపడుతున్న పనులు, జలసిరి కార్యక్రమం అమలు తీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న పనుల విషయంలో పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.