📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅధికారం లేకపోయినా ఆదరణ తగ్గని గులాబీ జెండా

అధికారం లేకపోయినా ఆదరణ తగ్గని గులాబీ జెండా

📰 Generate e-Paper Clip

అధికారం లేకపోయినా ఆదరణ తగ్గని గులాబీ జెండా

బీఆర్ఎస్‌లో చేరిన పొనుగోడు గ్రామ యువకులు

కడియం వెంకట్ రెడ్డి

గరిడేపల్లి, నవంబర్ (ప్రజావాణి):

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా గులాబీ జెండాకు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్‌నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి అన్నారు.

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన పలువురు యువకులకు ఆయన బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చే వారికంటే అధికారం లేని సమయంలో పార్టీకి అండగా నిలిచే వారే నిజమైన పార్టీ కుటుంబ సభ్యులని అన్నారు. పదవులు, అధికార ప్రయోజనాలను ఆశించకుండా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను గుర్తించి యువత స్వచ్ఛందంగా పార్టీలో చేరడం అభినందనీయమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకుండా నీటిమీది బుడగల్లా మారాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు.

పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ.. తమకు ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదని, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, కేటీఆర్ యువతకు ఇస్తున్న ప్రాధాన్యత నచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

పార్టీలో చేరిన వారిలో బంటు సుధాకర్, యల్లవుల రాములు, కొండమీద వెంకటేష్, మీడిసెనమెట్ల నవీన్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ అధికార ప్రతినిధి రామ్ సైదులు, మాజీ ఎంపీటీసీ మేళ్లచెరువు వెంకటరమణ, మాజీ సర్పంచ్ బొలిశెట్టి సుధీర్ కుమార్, నాయకులు బిల్లా వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు అనంతు కరుణాకర్ గౌడ్, రామ్ మధు, రాజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.