📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

📰 Generate e-Paper Clip

జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

సర్పంచ్ సావిత్రి సాయగౌడ్

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 02

కామారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు దోమల నివారణలో భాగంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ (ఫాగింగ్) కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గ్రామంలో దోమల వ్యాప్తిని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ గ్రామ సర్పంచ్ శ సావిత్రి సాయగౌడ్ ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు సాయినాథ్, తుకారం పటేల్, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.