వరుస ఘటనలతో మోడల్ స్కూల్‌పై సన్నగిల్లుతున్న విశ్వాసం!
విద్యార్థుల భద్రతపై కలెక్టర్ ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఎఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ డిమాండ్
కరీంనగర్, నవంబర్ 7 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని మోడల్ స్కూల్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని AIYF బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు.విద్యార్థుల భద్రత,పాఠశాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా నిర్లక్ష్యానికి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మొత్తం సిబ్బందిని మార్చి సమర్థులైన వారిని నియమించాలని కోరారు.పాఠశాలలో విద్యార్థులకు భద్రతతో కూడిన విద్యా వాతావరణం కల్పించి తల్లిదండ్రుల్లో తిరిగి విశ్వాసం నింపాలని సూచించారు.కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి AIYF ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని దొంతరవేణి మహేష్ హెచ్చరించారు.

