📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మడిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మడిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

📰 Generate e-Paper Clip

మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మడిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

* వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిడాక్టర్ కార్తీక్ రెడ్డి, డాక్టర్ విజేత రెడ్డి

జమ్మికుంట అక్టోబర్ 31 (ప్రజావాణి)

జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో జమ్మికుంట పట్టణంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోమడిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జమ్మికుంట మైత్రి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ కార్తీక్ రెడ్డి డాక్టర్ విజేత రెడ్డి సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వి కార్తీక్ రెడ్డి, ప్రముఖ ఛాతి వైద్య నిపుణురాలు ఎస్ విజేత రెడ్డిలు మాట్లాడుతూ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత. వరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే భావనతో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఆధునిక జీవనశైలి కారణంగా మానసిక ఒత్తిడి పెరిగి గుండెపోటు, మెదడు పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. సమతుల్యఆహారం తీసుకోవడం ప్రతిరోజూ నడక వ్యాయామం చేయడం తగినంత మంచినీరు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. మహిళలు ఆరోగ్య విషయాల్లో మరింత అవగాహనతో ఉండాలని పిలుపునిచ్చారు.90 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పసుల (మ్యాకమల్ల) తిరుమల వెంకటేష్, వార్డు సభ్యులు చెన్నవేన చంద్రమోళి అంజనేయులు, పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి, రామిడి సూర్య తేజ రెడ్డి, మర్రి శ్రీనివాస్, పంజాల ప్రవీణ్ గౌడ్, డాక్టర్ జి రాజేశ్వర్ రావు, ఆస్పత్రి సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.