ప్రభుత్వ విప్ విజయరమణారావుకు జన్మదిన శుభాకాంక్షలు
శివపల్లిలో స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసిన విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 8:
రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని విజ్జన్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని విజయరమణారావు స్వగృహానికి చేరుకున్న వినోద్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అల్లం వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విజయరమణారావు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
సామాన్య ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపడం ఆయన ప్రత్యేకతగా పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌గా రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు.
విజయరమణారావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజల ఆదరాభిమానాలతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అల్లం వినోద్ రెడ్డి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

