📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టుదలతో లక్ష్యం చేరి.. రాష్ట్రస్థాయి కబడ్డీకి పోత్కపల్లి విద్యార్థి

పట్టుదలతో లక్ష్యం చేరి.. రాష్ట్రస్థాయి కబడ్డీకి పోత్కపల్లి విద్యార్థి

📰 Generate e-Paper Clip

పట్టుదలతో లక్ష్యం చేరి.. రాష్ట్రస్థాయి కబడ్డీకి పోత్కపల్లి విద్యార్థి

క్రీడల్లో ప్రతిభ చాటిన పిట్టల సాయిప్రసాద్.. అభినందించిన ఉపాధ్యాయ బృందం

ఓదెల, పెద్దపల్లి ,ప్రజావాణి ప్రతినిధి :

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోత్కపల్లికి చెందిన పదవ తరగతి విద్యార్థి పిట్టల సాయిప్రసాద్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల నిర్వహించిన కబడ్డీ పోటీల్లో తన క్రీడా నైపుణ్యాన్ని, అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.

ఈ నెల 12, 13, 14 తేదీలలో వికారాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సాయిప్రసాద్ పాల్గొననున్నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు వేల్పుల హరికృష్ణ తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో క్రీడల్లో రాణిస్తున్న సాయిప్రసాద్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి రమేష్ విద్యార్థి సాయిప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యెబుషి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠశాలలో ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. సాయిప్రసాద్ రాష్ట్రస్థాయిలో కూడా తన ప్రతిభను చాటుకుని మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థి సాధించిన ఈ విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సాయిప్రసాద్‌ను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.