పట్టుదలతో లక్ష్యం చేరి.. రాష్ట్రస్థాయి కబడ్డీకి పోత్కపల్లి విద్యార్థి
పట్టుదలతో లక్ష్యం చేరి.. రాష్ట్రస్థాయి కబడ్డీకి పోత్కపల్లి విద్యార్థి క్రీడల్లో ప్రతిభ చాటిన పిట్టల సాయిప్రసాద్.. అభినందించిన ఉపాధ్యాయ బృందం ఓదెల, పెద్దపల్లి ,ప్రజావాణి ప్రతినిధి : పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోత్కపల్లికి చెందిన పదవ తరగతి విద్యార్థి పిట్టల సాయిప్రసాద్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల నిర్వహించిన కబడ్డీ పోటీల్లో తన క్రీడా నైపుణ్యాన్ని, అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 12, 13, 14...