చిన్నంబావి ప్రజావాణికి ఒకే దరఖాస్తు!
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో సుర్ణ ఆదర్శ్ గౌడ్
చిన్నంబావి, ప్రజావాణి: నవంబర్ 2
ప్రజా సమస్యలను వేగంగాపరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణికి స్పందన కరువైంది.సోమవారం చిన్నంబావి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మండలవ్యాప్తంగా కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే అందినట్లు ఎంపీడీవో సుర్ణ ఆదర్శ్ గౌడ్ వెల్లడించారు.
ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఎంపీఓరామస్వామి, ఏపీవోధనుంజయరాలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పలు శాఖల అధికారులు ఒకే వేదికపైఅందుబాటులో ఉంటున్నందున ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.
మండల కేంద్రంతో పాటు పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించి, సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

