📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaఇసుక ట్రాక్టర్ లకు దారి ఇవ్వం.. పొలాలను కాపాడుకుంటాం

ఇసుక ట్రాక్టర్ లకు దారి ఇవ్వం.. పొలాలను కాపాడుకుంటాం

📰 Generate e-Paper Clip

ఇసుక ట్రాక్టర్ లకు దారి ఇవ్వం.. పొలాలను కాపాడుకుంటాం.

–పొలాల బాటను రహదారిగా మార్చే ప్రయత్నం!

–46 ఏళ్లుగా ఉన్న బండ్ల బాటను విస్తరించి పొలాలను ధ్వంసం చేసే యత్నం.

–ఇసుక ట్రాక్టర్ల రాకపోకలతో 40–50 కుటుంబాలకు ఆస్తి నష్టం జరిగే ప్రమాదం.

–ప్రజావాణిలో తహసీల్దార్ కు గ్రామస్థుల వినతి

ప్రజావాణి,ముస్తాబాద్

ఇసుక అవసరాల కోసం ఉన్న పాత బండ్ల బాటను ఇసుక రవాణాకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయడంతో అవునూర్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక రవాణా కు దారిని పొలాలను ఇవ్వమని సోమవారం ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి లో అవునూర్ గ్రామస్తూలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. మా పొలాల కు వెళ్లే బాట సుమారు 46 ఏళ్ల క్రితం పొలాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న చిన్న బండ్ల బాటను విస్తరించి, ఆ మార్గం గుండా ఇసుక ట్రాక్టర్లను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పంట పొలాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అవునూర్ గ్రామంలోని ఏటి గడ్డ వీధి నుంచి ఉన్న చిన్న దారిని ఇసుక రవాణా కోసం విస్తరించే ప్రయత్నం జరుగుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న దారి గుండా ఇసుక ట్రాక్టర్లు రాకపోకలు సాగిస్తే సుమారు 40 నుంచి 50 కుటుంబాలకు చెందిన ఆస్తులకు నష్టం వాటిల్లడంతో పాటు, వారి జీవనోపాధికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే ఇరుకుగా ఉన్న బాట గుండా భారీ ట్రాక్టర్లు వెళ్లడం వల్ల ఇళ్లకు, పొలాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్గంలో ఇసుక రవాణాకు అనుమతించవద్దని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇసుక ట్రాక్టర్ల రాకపోకలకు అనుమతిస్తే గ్రామ ప్రజలతో కలిసి రాస్తారోకో చేపట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.ఈ సమస్యపై సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అవునూర్ గ్రామస్థులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. పాత బండ్ల బాటను యధావిధిగా ఉంచాలని, పొలాలు, ఇళ్లకు నష్టం కలిగించేలా రహదారి విస్తరణ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమం లో శరకొండ రామ్ రెడ్డి, నర్ర ప్రశాంత్ రెడ్డి,కటకం భాగ్యమ్మ, కటకం మహేష్, శ్యాగరాజయ్య, సౌల్ల రాములు శ్యాగ గౌరవ్వ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.