📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబెజ్జంకిలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

బెజ్జంకిలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకిలో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

పేదవాడి ఆకలి తీర్చి-దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన ఉక్కు మహిళ

బెజ్జంకి,అక్టోబర్ 31 (ప్రజావాణి)

గరిబీ హఠావో నినాదంతో దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చేందుకు కృషి చేసిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కత్తి రమేశ్ గౌడ్ అన్నారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.ఇందిరా గాంధీ భారత రాజకీయాల్లో ఉక్కు మహిళగా నిలిచారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారని కత్తి రమేశ్ గౌడ్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
దేశ ఐక్యత,సమగ్రత, భద్రత కోసం చివరి వరకు పోరాడిన ఇందిరా గాంధీ, దేశ ప్రయోజనాల కోసం తన ప్రాణాలనే అర్పించారని,ప్రధానిగా ఉన్న సమయంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన మహానేతగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పర్స సంతోష్, మార్కెట్ కమిటీ సభ్యుడు ఇస్కిల్ల ఐలయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ గంగాధర రామచంద్రం, వార్డు సభ్యుడు బోనగాం రమేష్, మాజీ దేవస్థానం చైర్మన్ జెల్ల ప్రభాకర్ యాదవ్, యూత్ అధ్యక్షుడు కర్రావుల సందీప్, బూట్ల చంద్రప్రకాష్, బోనగిరి ప్రసాద్, బండి వేణు, చిలుముల మోహన్, ఆయిలేని మహేందర్ రెడ్డి, బోనగం శంకర్, బోనగాం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.