📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకొండాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం

కొండాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం

📰 Generate e-Paper Clip

కొండాపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం
పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
కొండాపూర్ ఎస్సీ కాలనీలో రాజ్యాంగ హక్కులపై అవగాహన
దండేపల్లి, అక్టోబర్ 31 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వ హక్కు, అంటరానితనం నిర్మూలన, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవించాలని సూచించారు.
సమాజంలో కుల, మత, వర్గ వివక్షకు తావులేకుండా అందరూ సమానత్వ భావనతో మెలగాలని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్, ఉప సర్పంచ్ మన్నె రవికుమార్, పంచాయతీ కార్యదర్శి దర్శనాల నాగేష్, జీపీఓ వెంకటస్వామి, పోలీస్ సిబ్బంది జైవంత్, అంబేద్కర్ వారసుడు కొల్లూరి రవికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి సతీష్, ఐకేపీ సీఏ గుమ్మడి సునీత, ఆశ కార్యకర్త కొల్లూరి సువర్ణ, అంగన్‌వాడీ ఆయా బండారి స్రవంతి, వార్డు సభ్యులు భూమారావు, శ్రీధర్, సత్యనారాయణ, కారోబార్ ప్రభాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు, కాలనీవాసులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.