📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఒంగోలు నగరమంతా పసుపుమయం.. కూటమి ముగింపు ప్రచార ర్యాలీకి ప్రజల ఘన స్వాగతం

ఒంగోలు నగరమంతా పసుపుమయం.. కూటమి ముగింపు ప్రచార ర్యాలీకి ప్రజల ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

*ఒంగోలు నగరమంతా పసుపుమయం.. కూటమి ముగింపు ప్రచార ర్యాలీకి ప్రజల ఘన స్వాగతం!*

*మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప, 56 మంది కార్పొరేటర్ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ ర్యాలీ*

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 29

*ఒంగోలు:* ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్పతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ఎన్నికల్లో ప్రజల మద్దతుతో మంచి ఫలితాలు సాధిస్తామని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు.

ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప, నగరంలోని 56 మంది కార్పొరేటర్ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ శుక్రవారం సాయంత్రం కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ ముగింపు ప్రచార ర్యాలీ నిర్వహించారు.

ఒంగోలు నగరంలోని సెంట్రల్ కేఫ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ రోడ్డు మీదుగా మస్తాన్ దర్గా సెంటర్, బాపూజీ కాంప్లెక్స్ వరకు సాగింది. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీకి నగర ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ, నాయకులకు గజమాలలతో సత్కారం చేశారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఒంగోలు నగర వీధులన్నీ పసుపుమయంగా మారాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి.ఎన్. విజయ్ కుమార్ ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉడా చైర్మన్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ తదితర కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు అడుగడుగునా తమకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. *మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప* కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ విశేషమని, ఆమెతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, మునుపేన్నడు లేనివిధంగా భారీ మెజారిటీతో గెలవనున్నారని అన్నారు.

మేయర్ అభ్యర్థి శ్రీమతి నల్లమల్లి శ్రీ శిల్ప మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రతిసారి ప్రజలు తనను తమ ఇంటి బిడ్డగా ఆదరించి, చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివని తెలిపారు.
ఒంగోలు నగరంలోని ఓటరు మహాశయులందరూ నవంబర్ 1వ తేదీన జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి మేయర్గా తనను, నగరంలోని కార్పొరేటర్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మేయర్‌గా ఎన్నికైన అనంతరం ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారి సహకారంతో అమలు చేసేందుకు కృషి చేస్తానని, ఒంగోలు నగర సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తనకు అండగా నిలిచి సహకరించిన కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.