📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadహంగర్గ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

హంగర్గ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

📰 Generate e-Paper Clip

హంగర్గ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

పూల బతుకమ్మను ఎత్తి సంబరాల్లో పాల్గొన్న సర్పంచ్ నీరడి ఉదయ్ భాస్కర్.

 

కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండల పరిధిలోని హంగర్గ గ్రామంలో బతుకమ్మ వేడుకలను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు.ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా రంగురంగుల పూలతో అలంకరించిన సుందరమైన బతుకమ్మను సర్పంచ్ భక్తి శ్రద్ధలతో నెత్తిన ఎత్తుకొని సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు,చిన్నారులు విభిన్న వర్ణాల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ,జానపద బతుకమ్మ పాటలు పాడుతూ,డీజే పాటల మధ్య నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల జీవన విధానానికి ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి విశిష్టతకు బతుకమ్మ పండుగ ప్రతీక అని.ఊరంతా ఒకే చోట చేరి ప్రకృతి ప్రసాదించిన రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఈ విధంగా పండుగ చేసుకోవడం గ్రామ సమైక్యతకు నిదర్శనం అని పేర్కొన్నారు.గ్రామంలోని ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన పండుగ శుభాకాంక్ష లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ప్రజా ప్రతినిధులు,మహిళలు,చిన్నారులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.