📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaసమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు

సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు

📰 Generate e-Paper Clip

సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా నల్గొండ జిల్లాలో ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1)(బి) కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ అవార్డును స్వీకరించనున్నారు. సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ కలెక్టర్‌గా రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు జిల్లా అధికారులు, ఉద్యోగులు, సమాచార హక్కు చట్టం సంఘాల ప్రతినిధులు, ప్రజలు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.