వైయస్సార్ సిపి కమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి మారుజోళ్ళు కవితను నేను పరామర్శించడం నేరమా
నన్ను అరెస్ట్ చేసి వల్లూరు పోలీస్ స్టేషన్ లో పెట్టడం ఏమిటి సూటిగా ప్రశ్నించిన వైయస్సార్ సిపి కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం. కమలాపురం అక్టోబర్ 18 ప్రజావాణి వైయస్సార్ సిపి మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కమలాపురం లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మారుజోళ్ళు కవిత దగ్గర నుండి టిడిపి గుండాలు నామినేషన్ పత్రాలు లాక్కోవడం, మారుజోళ్ళు కవిత వెంబడి వెళ్లిన లక్ష్మీపై దాడులు చేయడాన్ని తెలుసుకునేందుకు కమలాపురంలోని వారి స్వగృహానికి ఆదివారం ఉదయం వెళ్ళిన నన్ను అరెస్టు చేసి వల్లూరు పోలీస్ స్టేషన్...