*విద్యుత్ వినియోగ దారుల పరిష్కార వేదిక…*
*విద్యుత్ వినియోగ దారులకు నిరంతరం గ్రీవెన్స్ రెడ్రేసల్ ఫోరం.*
*సీజీఆర్ఎఫ్ చైర్మన్ కే. సాయిబాబా.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07*
విద్యుత్ వినియోగ దారులకు ఎలక్ట్రిసిటీ కంజ్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రేసల్ ఫోరం నిరంత రాయంగా అందుబాటులో ఉంటుందని , వ్రాత పూర్వకంగా, ఇన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసి , వినియోగదారులు సమస్యలను పరిష్కా రించుకోవాలని సీ జీ ఆర్ ఎఫ్ చైర్మన్ కే. సాయి బాబా కోరారు. బుధవారం రోజు జిల్లా కేంద్రం భువనగిరిలోని కిసాన్ నగర్ లో గల విద్యుత్ కార్యాలయంలో జరిగిన “విద్యుత్ వినియోగ దారుల పరిష్కార వేదిక” లో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయలు , హెచ్చు తగ్గులు , విద్యుత్ మీటర్ల సమస్యలు , బిల్లుల సమస్యలు , కొత్త సర్వీసుల సమస్యలు , మీటర్ల పేరు మార్పిడి , క్యాటగిరి మార్పిడి, ట్రాన్స్ఫార్మర్ లో మార్పిడి మొదలైన సమస్యలు ఫోరంలో ఫిర్యాదు చేసి పరిష్కారం చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
*విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి…*

వినియోగదారుల సంఘాల ప్రతినిధి కొడాలి వెంకటేష్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగ దారుల సమస్యలను విద్యుత్ శాఖ అధికారులు సత్వరమే పరిష్క రించాలని వినియోగ దారుల సంఘాల ప్రతినిధి కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో మొక్కలను విద్యుత్ తీగల కింద పెట్టరాదని , అందుకు అధికారులు తగిన చర్యలు తీసు కోవాలని ఆయన కోరారు. విద్యుత్ వినియోగదారుల ప్రధాన సమస్యలైన లో ఓల్టేజ్ , ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు చేయడం , రైతాంగానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం , గృహ జ్యోతి పథకం అందరికీ అందు బాటులోకి తేవడం లాంటి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరుతూ ఫోరం సభ్యులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినియోగదారుల సమస్య ల పరిష్కార వేదికలో ఎలక్ట్రిసిటీ కంజ్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రూషల్ ఫోరం మెంబర్ టెక్నికల్ వి. రమణ మూర్తి , మెంబర్ ఫైనాన్స్ కే. శోభారాణి , కంజ్యూమర్ ఎఫైర్స్ మెంబర్ టి. కోటేశ్వరరావు భువనగిరి , రామన్నపేట , బీబీనగర్ , మోత్కూరు , ఆలేరు , చౌటుప్పల్ డివిజన్ ఇంజనీర్లు రవీందర్ , వెంకటేశ్వర్లు , సుధీర్ కుమార్ , పద్మ , శ్రీకాంత్ , బాలూ నాయక్ , ఫీర్యా , మోహన్ , పట్టణ ఏఈ సాయి కృష్ణ తది తరులు పాల్గొన్నారు.

