📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇండియా కూటమి నేతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి

ఇండియా కూటమి నేతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

*ఇండియా కూటమి నేతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి…*

*కాంగ్రెస్ అగ్రనేతలపై పోలీసుల చర్యలకు నిరసనగా బ్లాక్ డే.*

*పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.*

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య పాల్గొని ఓటర్ల జాబితా సవరణ , ఎన్ని కల ప్రక్రియలో పార దర్శకత తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ , ఇండియా కూటమి నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలను పోలీ సులు అదుపులోకి తీసు కున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నిరసనగా , ఏఐసీసీ పిలుపు మేరకు అక్టోబర్ 8వ తేదీని ‘బ్లాక్ డే’ గా పాటిస్తూ దేశ వ్యాప్తంగా రాష్ట్ర , జిల్లా , మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ కార్య క్రమంలో ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య పాల్గొని కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తల తో కలిసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణల పై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని , ఎన్నికల వ్యవస్థ పై ప్రజల్లో నెలకొన్న అను మానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు , నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని , ప్రతిపక్ష నాయకుల పై పోలీసుల చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వా సాన్ని మరింత బలోపేతం చేసేలా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని కోరారు. ప్రజా స్వామ్య పరిరక్షణ , ఓటర్ల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని నాయకులు పిలుపు నిచ్చారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , ప్రజా ప్రతి నిధులు , కార్యకర్తలు , యువజన నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.