యంనంపేట్‌లో భూభారతి–భూసర్వేపై అవగాహన సదస్సు…..భూముల సమగ్ర సర్వే, డిజిటల్ మ్యాపింగ్‌పై రైతులకు అవగాహన
ఘట్‌కేసర్, అక్టోబర్ 24 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలోని యంనంపేట్ గ్రామంలో భూభారతి–భూసర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూముల సమగ్ర సర్వే, డిజిటల్ మ్యాపింగ్, భూదార్ కార్డుల ప్రాముఖ్యతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. భూములకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయడం, భూముల సర్వే ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవడం, భూ రికార్డుల్లో పారదర్శకతకు సంబంధించిన అంశాలను అధికారులు వివరించారు. భూముల రక్షణ, రైతుల సంక్షేమం, పారదర్శక రెవెన్యూ వ్యవస్థ లక్ష్యంగా ఈ...