📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమూసీ ల్యాండ్ పూలింగ్‌పై గ్రామసభల షెడ్యూల్ ఖరారు

మూసీ ల్యాండ్ పూలింగ్‌పై గ్రామసభల షెడ్యూల్ ఖరారు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి ఘట్‌కేసర్ మండల పరిధిలోని ఐదు గ్రామాలకు గ్రామసభల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఘట్‌కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంబంధిత గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎదులాబాద్ గ్రామంలో అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు రైతు వేదికలో గ్రామసభ నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 26న ఉదయం 11 గంటలకు కొర్రెముల పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రతాపసింగారం రైతు వేదికలో ప్రతాపసింగారం, కాచవానిసింగారం, ముత్తివెల్లిగూడ గ్రామాలకు సంబంధించి గ్రామసభ నిర్వహించనున్నారు.

మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన అంశాలపై నిర్వహించే ఈ గ్రామసభలకు ఆయా గ్రామాల ప్రజలు హాజరై వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.