ఘట్కేసర్, అక్టోబర్ 7 (ప్రజావాణి): మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై ఘట్కేసర్ మండలంలోని ప్రతాపసింగారం, కాచవానిసింగారం, ముత్తవెల్లిగూడ, కొర్రెముల, ఎదులాబాద్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.240లోని అంశాలను పట్టాదారులు, రైతులు, గ్రామస్తులకు అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, పోచారం డివిజన్ ఇన్చార్జ్ కర్రి రాజేష్, మాజీ ఎంపీటీసీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీఓ నం.240 వివరాలను ప్రజలకు తెలియజేశారు. రైతులు, భూ యజమానులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, ల్యాండ్ పూలింగ్‌పై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని వారు సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ, ప్రభుత్వ మార్గదర్శకాలు, జీఓ నం.240లోని ముఖ్యమైన అంశాలను వివరించారు. సంబంధిత పట్టాదారులు, రైతులు, గ్రామస్తుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. రైతుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
కార్యక్రమంలో ఆర్ఐ సాయిరాం, కావ్య, సర్వేయర్ రూప, జీపీవోలు మంజుల, ప్రవీణ్,అశోక్, మాధవరెడ్డి, సత్యనారాయణ,అన్నపూర్ణ ప్రతిభ, వెంకటేష్, శ్రవణ్,మున్నీ,చందు, రాజేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


