మూసీ ల్యాండ్ పూలింగ్‌పై గ్రామసభలు….జీఓ నం.240పై పట్టాదారులు, రైతులకు అవగాహన

ఘట్‌కేసర్, అక్టోబర్ 7 (ప్రజావాణి): మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై ఘట్‌కేసర్ మండలంలోని ప్రతాపసింగారం, కాచవానిసింగారం, ముత్తవెల్లిగూడ, కొర్రెముల, ఎదులాబాద్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.240లోని అంశాలను పట్టాదారులు, రైతులు, గ్రామస్తులకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, పోచారం డివిజన్ ఇన్‌చార్జ్ కర్రి రాజేష్, మాజీ ఎంపీటీసీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీఓ...