మహిళ భవనాల స్థలాలను పరిశీలించిన ఎంపిడిఓ శ్రీనివాస్
మద్దూరు అక్టోబర్9, ప్రజా వాణి,
మండలంలోని మర్మముల, ధర్మారం,లద్నూరు గ్రామాలలో ఎంపిడిఓ శ్రీనివాస్ పర్యటించి వి ఓ భవనాల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని సర్పంచులకు తెలియజేశారు.భవనాలు నిర్మించే స్థలాలను సర్పంచుల సమక్షంలో మద్దూరు ఎంపిడిఓ శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలసిరి కార్యక్రమంలో బాగంగా గ్రామంలోని అర్హత ఉన్న అన్ని గృహాలకు మ్యాజిక్ సోక్ పిట్స్ పెద్దమొత్తంలో నిర్మాణాలు చేయాలని సర్పంచులను కోరారు.మరియు గ్రామాలలో బతుకమ్మ ఆడు స్థలాలలో పారిశుధ్య పనులు, విద్యుత్ సౌకర్యం పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు సుందరగిరి సత్యనారాయణ గౌడ్,జక్కుల కనుకమ్మ,రేణుక కనుకరాజు,ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, పి అర్ ఎ ఈ శివకుమార్, పంచాయితి కార్యదర్శులు బి.అశోక్, అర్.అశోక్ , మధు,జక్కుల రమేష్ పాల్గొన్నారు.

