📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమహాలక్ష్మి పేరుతో ప్రజా రవాణాను కుదించారు

మహాలక్ష్మి పేరుతో ప్రజా రవాణాను కుదించారు

📰 Generate e-Paper Clip

మహాలక్ష్మి పేరుతో ప్రజా రవాణాను కుదించారు
మహిళలు, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది: బీజేపీ
కూసుమంచి, అక్టోబర్ 2 (ప్రజావాణి):
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు పథకం పేరుతో ప్రజా రవాణా సౌకర్యాలను కుదించి మహిళలు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గడ్డం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఉన్న బస్సుల సంఖ్యను తగ్గించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
సాయంత్రం 4 గంటల తర్వాత జిల్లాల నుంచి హైదరాబాద్‌కు, రాత్రి 9 గంటల తర్వాత హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లేందుకు తగినన్ని బస్సులు అందుబాటులో లేక మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బస్సుల సంఖ్య తగ్గడంతో పురుష ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడుతోందన్నారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలహీనపరుస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, బస్సుల సంఖ్యను పెంచి ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలని గడ్డం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.