మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
*మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు* * *మన ప్రజావాణి* *మందమర్రి*:- పట్టణంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతుండగా, బుధవారం నాలుగవ రోజు అమ్మవారు మహాచండి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని రెండవ జోన్ లో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ కనకదుర్గ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు మహా చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా మండలి ఆధ్వర్యంలో బుధవారం భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు....