ఘట్‌కేసర్, అక్టోబర్ 11 (ప్రజావాణి): ఘట్‌కేసర్ మండల పరిధిలోని మర్రిపల్లిగూడ గ్రామంలో ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా **చిలుగూరి ఆనంద్** ఎన్నికయ్యారు.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల స్థాయిలో నూతన కమిటీల ఏర్పాటు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. మాదిగ జాతి హక్కుల సాధనతో పాటు సమాజ అభివృద్ధి కోసం మందకృష్ణ మాదిగ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఐక్యంగా పాల్గొని ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుండె ఉపేందర్ మాదిగ, ఉపాధ్యక్షుడు జమ్మి గారి గణేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి ఊషిగల్ల వినోద్ కుమార్ మాదిగ, రెండో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాదిగ, ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడు కడుపోల్ల కర్ణాకర్ మాదిగ పాల్గొన్నారు.
నూతన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యక్షుడిగా చిలుగూరి ఆనంద్ఉపాధ్యక్షుడిగా చిలుగూరి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా చిలుగూరి ఉపేందర్, అధికార ప్రతినిధులుగా చిలుగూరి పవన్ కళ్యాణ్, చిలుగూరి వికాస్, మీడియా ప్రతినిధిగా రాపోలు హరికృష్ణ ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షుడు చిలుగూరి ఆనంద్ నాయకత్వంలో గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ను బలోపేతం చేస్తూ, మాదిగ జాతి హక్కుల సాధనకు కృషి చేయాలని నాయకులు ఆకాక్షించారు.

