మర్రిపల్లిగూడ ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చిలుగూరి ఆనంద్…మాదిగ జాతి హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి..

ఘట్‌కేసర్, అక్టోబర్ 11 (ప్రజావాణి): ఘట్‌కేసర్ మండల పరిధిలోని మర్రిపల్లిగూడ గ్రామంలో ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా **చిలుగూరి ఆనంద్** ఎన్నికయ్యారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల స్థాయిలో నూతన కమిటీల ఏర్పాటు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. మాదిగ జాతి హక్కుల సాధనతో పాటు సమాజ అభివృద్ధి కోసం మందకృష్ణ మాదిగ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఐక్యంగా పాల్గొని ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు....